JAISW News Telugu

Budget Sessions: నేడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ చివరి రోజు

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చివరి సమావేశం జరగనుంది. ఉదయం సభ ప్రారంభం కానుండగా 20 24- 25 బడ్జెట్ పై ప్రభుత్వం చర్చ చేపట్ట నుంది. వివిధ శాఖల మాన్యువల్ నివేదికలు రాష్ట్రప్రభుత్వం  సభ ముందు పెట్టనున్నారు.  బడ్జెట్లోని అంశాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగించనున్నారు. వివిధ పథకాలకు కేటాయించిన బడ్జెట్ తదితర అంశాలను నిన్నటి సభలో ముఖ్యమంత్రి తెలియజేశారు.. సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని సిఎం తెలియజేశారు. నేడు బడ్జెట్ చివరి సమావేశాలు కావడంతో కేటాయింపులు ఏవిదంగా ఉండబోతున్నాయని అందరు ఆసక్తి గాఎదురు చూస్తున్నారు.

Exit mobile version