Missing : నిత్యం ఎంతో మంది చిన్నారులు తప్పిపోతుంటారు. కొందరు ఇంటి నుంచి తల్లిదండ్రులపై కోపంతో, మరికొందరు జాతరలు, తిరునాళ్లలో, కొందరు ప్రమాదవశాత్తు తమ వాళ్ల నుంచి తప్పిపోతుంటారు. అయితే వీరు రైలెక్కి ఏ తెలియని ప్రాంతానికో వెళ్లి అన్ని ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారిని అక్కునచేర్చుకోవడం, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం సగటు పౌరులుగా మన బాధ్యత.
ఇటీవల ఓ అబ్బాయి తప్పిపోయి కాశీకి చేరుకున్నాడు. అమ్మనాన్నలపై అలిగి ఏదో రైలెక్కి కాశీకి వెళ్లాడు. ఊరి పేరు అడిగితే ఏపీలోని తెనాలి పేరు చెబుతున్నాడు. మిగతా వివరాలు చెప్పలేకపోతున్నాడని తన్నీరు శివశంకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ అతడి ఫొటోను పెట్టి..షేర్ చేశాడు. ఈ బాబును ఎవరైనా గుర్తుపట్టి..అతడి తల్లిదండ్రులకు, తెలిసినవారికి సమాచారం అందించాలని కోరుతున్నాడు. తనకు తెలిసిన వారి దగ్గర అబ్బాయి క్షేమంగా ఉన్నాడని అందులో పేర్కొన్నాడు. తెనాలి ప్రాంతానికి చెందిన వారు ఈ మెసేజ్ ను అబ్బాయి తల్లిదండ్రులకు, అతడి చుట్టాలకు చేరేదాక ఫార్వర్డ్ చేయండని సూచించాడు. అబ్బాయికి తెలిసిన వారుగానీ, తల్లిదండ్రులు గానీ ఈ మెసేజ్ ను చూస్తే తన ఫోన్ నంబర్ 98483 66711 లో సంప్రదించాలని కోరాడు.
మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ మెసేజ్ ను తెనాలికి చేరేదాక షేర్ చేయాలని అతడు సూచించాడు. అమాయక బాలుడిని తన తల్లిదండ్రుల వద్దకు చేర్పించేందుకు ప్రభుత్వ వర్గాలు, వ్యక్తులు, సంఘాలు..ఇలా ఎవరైనా సరే సహకరించాలని శివశంకర్ కోరాడు.