కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతి కి గురి చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్ చేశారు. నందిత తండ్రి స్వర్గీయ సాయన్నతో నాకు సన్నిహిత సంబంధం ఉండేదని సీఎం తెలిపారు. ఇదే నెలలో సాయన్న స్వర్గస్తులవడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. సరిగ్గా ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మృతి చెందడం అత్యంత విషాదకరమని సీఎం అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారని సీఎం పేర్కొన్నారు.