ఏపి: గురుకులాల్లోని మహిళాఉద్యోగులకు ఏడాదికి అదనంగా 5 రోజులు సెలవులు (క్యాజువల్ లీవ్స్) ఇవ్వాల ని నిర్ణయిం చినట్లు మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. రెగ్యూలర్,కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పనిస్త్తున్న మహిళలందరికీ ఇది వర్తిస్తుందని మంత్రి నాగార్జున వెల్లడిం చారు. ఎస్పీ గురుకులాల్లో బదిలీలకు శాశ్వత మార్గ దర్శకాలు రూపొందిస్తున్నామని..టిజిటి టీటర్లకు పిజీ తప్పని సరిగా ఉండాలన్న నిబంధన లను సడలించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
మెత్తం మీద గురుకులాల్లోని మహిళా ఉద్యోగులకు భారీ ఊరట లబించిందని చెప్పవచ్చు. సెలవులు తక్కువగా ఉండటం వల్ల గతంలో ఇబ్బందు లు పడేవారని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారికి అదనంగా మరో ఐదు రోజులు సెలవులు ప్రకటించడం శుభ పరిణామం అని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.