Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీ పరిమారమఠం ఉడిపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ., ఏపీ సమాచార శాఖ మంత్రి చల్లబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ., ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐలాపురం రాజా., తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద., ఏపీ మంత్రి అంబటి రాంబాబు., ఎమ్మెల్సీ రఘు రాజు. ప్రభుత్వ విప్ విక్రాంత్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా..ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.