MLA found Lying Apartment : ఆ అపార్ట్ మెంట్ లో అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే!!

MLA found Lying Apartment
MLA found Lying Apartment : హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఓ వైసీపీ ఎమ్మెల్యే పక్కనున్న వారిపై గొడవకు దిగాడు. వారిని దుర్భాషలాడుతూ వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. రాత్రి పదిగంటలకు వారిని పిలుస్తూ ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. దీనిపై గొడవ జరిగింది. పక్కనున్న వారు ఎమ్మెల్యే అయితే మాకేంటి? ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నావని వారు సరైన రీతిలోనే సమాధానం చెప్పారు.
ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అధికారంలో ఉంటే ఎవరికి గొప్ప? ఎవరి పని వారిది? ఎవరి కుటుంబం వారిది? అంతే కాని ఎమ్మెల్యే అయినంత మాత్రాన కొమ్ములుంటాయా? అని ప్రశ్నిస్తున్నారు. చీటికి మాటికి గొడవకు దిగితే ఉపేక్షించేది లేదని ఘాటుగా బదులిచ్చారు. ఎవరి హద్దుల్లో వారుండాలి. ఎదుటి వారి చేత గౌరవింపబడాలి. అంతేకాని చిల్లర వేషాలు వేస్తే ఉతుకుతాం అని హెచ్చరించారు.
హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎవరికి ఎవరు భయపడరు. సీఎం అయినా సరే గమ్మున ఉండాల్సిందే. ఎవరి పని వారు చేసుకుంటూ ఎవరి దారిన వారు వెళ్లాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే గూబ గుయ్యిమంటది. ఒక్క దెబ్బ వేస్తే హల్ చల్ అవుతుంది. అందాకా తెచ్చుకోవద్దనే సూచనలు వారు ముందు నుంచి చేస్తున్నారు.
కానీ వైసీపీ ఎమ్మెల్యేకు బలుపు బాగుంది అంటున్నారు. గొప్ప గొప్ప వారే మాకెందుకు అని సర్దిపెట్టుకుంటారు. ఇతడు మాత్రం రెచ్చిపోతున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు అక్షింతలు పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ మెంట్లోని వారు అంతా ఒక్కటైతే ఎమ్మెల్యే తాట తీస్తారు. చివరకు చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి సుమా అంటున్నారు.