Godavari Floods : గోదావరికి తగ్గిన వరద.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు

Godavari
Godavari Floods : గోదావరి నదిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.7 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సముద్రంలోకి 12.95 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కోనసీమ లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. నాలుక లంక గ్రామాల ప్రజలు వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.
గోదావరి వరదలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వరి సాగు సుమారు 45 వేల ఎకరాలు, 15 వేల ఎకరాలకు సరిపడే నారుమళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అరటి, బొప్పాయి, పూలు, కూరగాయలు, తమలపాకు పంటలు పదివేల ఎకరాల్లో నీటమునిగాయి. వరదల ప్రభావం కోనసీమ జిల్లాలోని 50 గ్రామాల పరిధిలో 200 నివాసాలపై ఉంది.