Achchennaidu : దళిత బిడ్డ శ్రీను పట్ల ముఖ్యమంత్రి అమానుషంగా వ్యవహరించారు..టిడిపి నేత అచ్చెన్నాయుడు

కోడి కత్తి కేసులో   జనపల్లి  శ్రీనివాసరావుకు బెయిల్ రావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు అన్నారు.  ఓ దళిత బిడ్డ పట్ల ము ఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.  కోడి కత్తి కేసు ద్వారా జగన్ అబద్దాలతో లబ్ధి పొంది సీఎం అయ్యారని ఆయన విమర్శిం చారు.

శ్రీనుకు న్యాయస్థానం బెయిల్  ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందని అచ్చెం నాయుడు తెలిపారు. కాగా ఎట్టకేలకు కోడి కత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.  కోడి కత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు షరతులతో  కూడిన బెయిల్ ను  హైకోర్టు మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లా డొద్దని ర్యాలీలు, సభల్లో, పాల్గొనవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

TAGS