Errabelli Dayakar :అందుకే నేను ఎన్నికల్లో ఓడిపోయాను..మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు!

Errabelli Dayakar : తన ఓటమి గురించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏడుసార్లు గెలిచానని ఇంకా అవస రమా అని ప్రజలు ఓట్లు వేయలేదని చెప్పారు.  అంతేగాక కొంతమంది ఏడుపు కూడా తన ఓటమికి కారణమన్నారు. ఎన్టీ రామారావు లాంటి గొప్ప నేతలను కూడా ఓటర్లు ఓడగట్టారని ఆయన తెలిపారు.

జనగామ జిల్లా పసరమడ్ల లోని ఉషోదయ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని ఆయన చెప్పుకొచ్చారు.

తప్పుడు కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎవరు భయపడద్దని ఎర్రబెల్లి అన్నారు. ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాల్లో  మునిగిపోతుందని చెప్పారు. కృష్ణా జలాల వివాదం మొదలైందని అన్నారు. ఇక గోదావరి జలాల  వివాదం కూడా వస్తుందని చెప్పారు.  ప్రభుత్వం లేదని కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. కార్యకర్తలకు తమ అండదండలు ఉంటాయని చెప్పారు. కమిటీలలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిపై సమీక్ష జరిపి కొత్త కమిటీలు వేస్తామని తెలిపారు.

TAGS