ఏపీ: ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు పరీక్ష ఫీజులు రిఫండ్ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటిం చారు. వారు ఎస్జీటి పోస్టులకు అనర్హులని హైకోర్టు ప్రకటించడంతో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఆధార్ లింకై ఉన్న బ్యాంక్ అకౌంట్ పరీక్ష ఫీజును క్రెడిట్ చేస్తామని అధికారులు వెల్లడించారు.
టెట్ కు 2,67,559 దరఖాస్తులు వచ్చాయని హాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబా టులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్జీటి పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న బీఈడీ అభ్యర్థులకు రీఫండ్ ను త్వరలో నే చేస్తామన్నారు. ఎస్టీజీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హలని కోర్టు తీర్పు నివ్వడంతో అధికారులు వారు ప్రభుత్వానికి కట్టిన ఫీజును రిటర్న్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.