DK Shivakumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న ప్రశాంతంగా ముగిసిన విసయం తెలిసిందే. డిసెంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఎగ్లిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో అనుకూల తీర్పు వస్తుందని, ఈ సారి కాంగ్రెస్ అధికారం చేపడుతుందని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా మారి అధికారాన్ని అందించిన డీకె శివకుమార్‌ను ఇందు కోసం రంగంలోకి దించేసింది.
అంతే కాకుండా కర్ణాటక క్యాంపు రాజకీయాల్లో ఆరి తేరిన నేతగా పేరున్న శివకుమార్ అయితేనే ఇక్కడ వ్యవహారాన్ని చక్కబెడతారని గ్రహించిన ఢిల్లీ అధిష్టానం గెలిచే ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండాలనే ఆలోచనతో ఆయనని రంగంలోకి దించేసింది. అనేక సంక్షభ పమయాల్లో తనదైన చాణక్యంతో డీకె శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్‌గా నిలిచారు. ఆ కారణంగానే తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ ఆయనని కాంగ్రెస్ వర్గాలు హైదరాబాద్ రప్పించాయి.
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆయన ప్లాన్‌నే అమలు చేసింది. అంతే కాకుండా శివకుమార్ ఎన్నికల ప్రచార వేళ కూడా పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అండగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలే వెలువడతాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో గెలిచిన అభ్యుర్థులు పార్టీ వీడిపోకుండా క్యాంపు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ డీకెని రంగంలోకి దించింది. 3న రానున్న ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వస్తే నేతలు చేయి జారి పోకుండా చూసుకునే బాధ్యతని కాంగ్రెస్ ఢీకె శివకుమార్‌కు అప్పగించింది.
ఇందు కోసం ఫలితాలకు ఒక రోజు ముందుగానే డీకె శివకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. ఫలితాలని బట్టి శివకుమార్ తన ప్లాన్‌ని అమలు చేయనున్నారని, గెలిచిన అభ్యర్థి విక్టరీ సర్టిఫికెట్ అందుకున్న మరుక్షణమే వారిని తాజ్ కృష్ణ హోటల్‌కు తరలించాలని పెద్ద ప్రణాళికనే డీకే శివకుమార్ రచించినట్టుగా తెలుస్తోంది. పూర్తి మెజారిటీ వచ్చినా సరే ఇదే ప్యూహాన్ని అమలు చేస్తూ పార్టీ ప్రతినిధులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుడా జాగ్రత్తలు తీసుకోనున్నారట. అయితే డీకే శివ కుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. మేము క్యాంపు రాజకీయాలు చేయమని, మా ఎమ్మెల్యే అభ్యర్థులని కొందరు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, అయితే మా వాళ్లు అలాంటి ప్రలోభాలకు లొంగరని తేల్చి చెప్పారు.