Telangana Elections 2023 : ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు వీరే
Telangana Elections 2023 : హైదరాబాద్ లోని అంబర్ పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ, జూబ్లీహిల్స్ అభ్యర్థి అజహరుద్దీన్, అతడి కుమారుడు అసదుద్దీన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అధికారులు కోరుతున్నారు. నల్లగండ్ల గ్రామంలోని బూత్ నెంబర్ 33లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి ఓటు వేశారు.
హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తన ఓటు వేశారు. మంచిర్యాల టౌన్ లోని కార్కెన్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.
ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేయడం కనీస బాధ్యతని గుర్తించి చాలా మంది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించగా వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఇంజినీర్లు ఈవీఎంలను పరీక్షించి పని చేయకుంటే వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగానే ప్రారంభమైంది. ఈవీఎంలలో అభ్యర్థుల జాతకాలు నిక్షిప్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగుతోంది. ఎలాంటి గొడవలు, అల్లర్లు జరిగిన సంఘటనలు లేవనే చెప్పాలి. మొత్తానికి ఎన్నికలు సజావుగానే సాగుతున్నాయి.