Harish Rao : తెలంగాణ సీఎం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు..మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇలా మాట్లాడతారా అని ప్రజల అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.  సీఎం భాష విలువలు పెంచేదిగా ఉండాలని హితువు పలికారు. తెలం గాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై నీచమైన భాష వాడారని ఆయన మండిపడ్డారు.  ప్రాజెక్టులు అప్పజెప్పా మని రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు.

కేఆర్ఎంబి మీటింగ్ లో ప్రాజెక్టులు అప్పగించడానికి అంగీకరించారని అందుకే వివాదం మొదలైంది అన్నారు. జనవరి 17న ఢిల్లీలో జరిగిన మీ టింగ్లో ప్రాజెక్టులు అప్పగింతకు తెలిపారు అన్నారు మినిట్స్ లో అదే స్పష్టంగా ఉందని అయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని విమర్శించారు.

TAGS