భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని రాంచి లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రి శ్రీనివాసరెడ్డి కలిసారు. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రాంచీ లో తన పర్యటనను కోనసాగిస్తున్నారు. రెండో విడుత యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ వేలాధి మంది కార్యకర్తలతో తన పాదయాత్రను కోనసాగిస్తున్నారు. రాంచీ లో జరుగుతున్న ఈ పాదయాత్రకు వెళ్లి రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రులతో కలిసి రాంచీ కి వెళ్లారు. రాహుల్ గాంధీ విరామం తీసుకుంటున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఆయనను కలిశారు.