TDP MLAs Suspended: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవరోజు మొదలయ్యాయి. సభ ప్రారంభం కాగానే రైతాంగ సమస్య లపై టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చే పట్టాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందర గోళ పరిస్థితి నెలకొనడంతో ఈరోజు కూడా టిడిపి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
సభ మెదలు అవగానే వాయిదా తీర్మానంపై చర్చకు టిడిపి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ టిడిపి సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఐఐఐటీలకు సంబంధించిన సవరణ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో టి డిపి సభ్యులు నినాదాలు చేశారు. రైతులను దగా చేసిన ప్రభుత్వం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ టిడిపి ఎమ్మల్యేలను సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు వీరే..
బెందళం అశోక్
అచ్చెం నాయుడు
నందమూరి బాలకృష్ణ
బుచ్చయ్య చౌదరి
నిమ్మకాయల చినరాజప్ప
ఘణ వెంకటరెడ్డి నాయుడు
వెలగపూడి రామకృష్ణ బాబు
నిమ్మల రామానాయుడు
రామరాజు
డోల బాల వీరాంజనేయస్వామి