Madin India Train : 22 కోచ్ ల కోసం ఆర్డర్ ప్లేస్ చేసిన సిడ్నీ.. చరిత్రలో ఫస్ట్ టైం మేడిన్ ఇండియా ట్రైన్ బోగీలు ఇతర దేశాల్లో..

Madin India Train

Madin India Train

Madin India Train : భారత్ రాను రాను అత్యంత శక్తి వంతమైన దేశంగా ఎదుగుతోంది. ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం భారత్ వైపునకు చూస్తున్నాయని మనకు తెలిసిందే. ఒకప్పుడు మేడిన్ ఇండియా అంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ నేడు మేడిన్ ఇండియా అంటే ప్రపంచంలో అతిపెద్ద బ్రాండ్ గా మారుతోంది. ఇక్కడి ప్రొడక్ట్స్ గురించి ప్రపంచం యావత్తు ఆతృతగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఇక్కడి వస్తువులు నాణ్యతతో పోటీపడతాయి. హ్యాండ్ క్రాఫ్ట్ నుంచి  పెద్ద పెద్ద రైలు భోగీల వరకు ఇండియా తయారు చేస్తోంది.

గతంలో స్పీడ్ ట్రైన్ కావాలని ఇండియా కోరుకున్న సందర్భంలో జపాన్ కోట్లాది రూపాయలు కావలని కోరింది. కానీ ఇండియా తక్కువ ఖర్చుతో కేవలం 18 నెలల్లో ‘ట్రైన్ 18’ను తీసుకువచ్చింది. ఇదే వందే భారత్ ట్రైన్లుగా ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇక ట్రైన్ల బోగీలు తయారు చేయడంలో నేడు దేశం ప్రపంచంతో పోటీ పడుతోంది. స్పీడును తట్టుకునేలా బోగీలు ఉండడం, సౌకర్యం, ఇంటీరియర్ లాంటివి అందంగా ఉండడంతో విదేశీయులు సైతం ఇక్కడి నుంచి బోగీలను బుక్ చేసుకుంటున్నారు.

‘సిడ్నీ రైల్వే సంస్థ’ వారికి కావాల్సిన ట్రైన్ల బోగీ(కోచ్)లను భారత్ నుంచి తెప్పించకోవాలని చూస్తోంది. అందుకే 22 బోగీలను తయారు చేసి ఇవ్వాల్సిందిగా భారత్ రైల్వేను కోరింది. భారత్ రైల్వే కూడా అందుకు అంగీకరించింది. చరిత్రలో మొదటి సారి ఇండియా ఇతర దేశాలకు రైల్వే భోగీలను తయారు చేసి ఇవ్వడం. దీనిపై నెటిజన్లు భిన్నంగ స్పందిస్తున్నారు. ఇది నవ భారత్ అని ఇప్పుడు భారత్ తో అన్నీ సాధ్యం అంటున్నారు.

TAGS