Sudden inspections : హోటల్లో తినుబండారాల..దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు.
వికారాబాద్ జిల్లా : తాండూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటల్లో , తినుబండారాల దుకా ణా లను ఆక స్మికంగా మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాండూర్ నూతన కమిషనర్ విక్రమసింహారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలో లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న హోటళ్ల దుకాణాలను తనిఖీ చేశారు.
ఈ నేపథ్యంలో పట్టణం లోని మెట్రో మనీలియ రెస్టారెంట్ హోటల్ మున్సిపల్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్నందుకు హోటల్ పై 25000 రూపాయల జరిమానాలను విధించారు. అదేవిధంగా. పలు హోటలలో తినుబండారాలకు సంబం ధించిన మాంసాన్ని పరిశీలించడం జరిగింది.
అలాగే అనుమతి లేకుండా సోడా బండిలో తిను బండారం లని,మద్యం విక్రయిస్తున్న వ్యాపారస్తుని పట్టుకొని బండి వాహ నాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖి లో పారిశుద్ధ్యం విభాగ అధికారులు , కృష్ణ,వెంకటయ్య శ్రీనివాస్, హరికృష్ణ, వీరన్న బాలు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యాపారస్తులు మున్సిపల్ లైసెన్స్ ను కచ్చితంగా తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.