ప్రకాశం జిల్లా: ఒంగోలులో ఈరోజు సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జగన్ ఒంగోలు కి వస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ బహిరంగ సభను సైతం నిర్వహించనున్నారు. బహిరంగ సభకి జన సమీకరణ కోసం ప్రైవేట్ స్కూల్ బస్సులను అధికారులు స్వాధీనం చేసు కున్నారు.
పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ మిగిలిన విద్యార్థులకు ఈ రోజు నుంచి ఎఫ్ ఏ-4 పరీక్షలు జరగనున్నాయి. బస్సులు లేకపోవ డంతో విద్యా ర్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి 500 కు పైగా ఆర్టీసీ బస్సులను జగన్ సభ కోసం అధికా రు లు పెట్టారు. డిపోలలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.