School wall : స్కూల్ గోడ కూలి విద్యార్థి మృతి.. రూ.5 లక్షల ప్రభుత్వ సాయం అందజేత

School wall : నాలుగు రోజుల క్రితం స్కూల్ గోడ కూలి మృతి చెందిన విద్యార్థి గురుమహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం సాయం చేసింది. ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేశ్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, మంగళవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి చెక్కు అందజేశారు. కుటుంబానికి ఇంటి స్థలం, మరో కుమారుడి చదువుకు సహకరిస్తామని శ్రీధర్ రెడ్డి చెప్పారు. మానవ తప్పిదం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నెల్లూరు భక్తవత్సల నగర్ లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ పాఠశాలలో కొత్తపాళెం గురుమహేంద్ర (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. గత శుక్రవారం సాయం 4 గంటల సమయంలో అక్కడ నిర్మాణంలో ఉన్న నాడు-నేడు అదనపు తరగతి గదుల మొండి గోడల వద్దకు వెళ్లి కిటికీపై ఉన్న లెంటల్ ను పట్టుకున్నాడు. అది విరిగి విద్యార్థి తలపై పడడంతో మృతి చెందాడు. తల్లిదండ్రులది తిరుపతి జిల్లా వెంకగడిర స్వగ్రామం. కుమారుడి చదువు కోసం నగరానికి వలస వచ్చారు.

TAGS