JAISW News Telugu

Stock Market : నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 1,500 పాయింట్లు డౌన్

Stock Market

Stock Market

Stock market : ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు (సోమవారం) ఉదయం కుప్పకూలింది. 2024, ఆగస్ట్ 5వ తేదీ ప్రారంభంలోనే నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ 15 వందల పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్లు నష్టపోయింది. 90 శాతం షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, బ్రిటానియా, నెస్లే, ఏషియన్ పెయింట్స్, టీసీఎల్ వంటి అతి కొద్ది షేర్లు మాత్రం గ్రీన్ లో ఉండగా, మిగతా అన్ని కేటగిరిల్లోని షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణం.. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులే కారణమని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్, ఇరాన్ దేశాల మధ్య నెలకున్న యుద్ధ వాతావరణం, ఏషియా, జపాన్ స్టాక్ మార్కెట్లు 7 శాతం వరకు నష్టాల్లో ముగియటం, అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న వార్తలు రావడం, అమెరికాలో ఉద్యోగాల నియామకం దారుణంగా తగ్గిపోవటం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయి. కొన్ని రోజులుగా ఇండియాలో ప్రత్యక్ష పెట్టబడులు సైతం తగ్గిపోయాయి. ఈ కారణం వల్ల కూడా మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

సెన్సెక్స్ 3 శాతం, నిఫ్టీ ఒకటిన్నర శాతం నష్టపోయింది. ఇక సంపద విషయానికి వస్తే లక్షల కోట్ల రూపాయల జనం డబ్బు ఆవిరి అయింది. చాలా షేర్లు 10 నుంచి 20 శాతం వరకు తగ్గాయి.

Exit mobile version