Srisailam : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. 10 గేట్లు ఎత్తివేత

Srisailam

Srisailam

Srisailam : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండగా 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 2.75 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3.79 లక్షల క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 3.59 లక్షల క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.9 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 212.91 టీఎంసీలకు చేరింది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1600 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 21,432 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని నిన్న (బుధవారం) విడుదల చేశారు.

TAGS