Naralokesh Couple: శ్రీశైల భ్రమరాంబ,మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న..నారాలోకేష్ దంపతులు
నంద్యాల జిల్లా శ్రీశైలం లో శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని టిడిపి యువనేత నారా లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకు లు నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు ఘన స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ,మల్లికార్జున స్వామి వా రిని లోకేష్ దంపతులు దర్శిం చుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ముందుగా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా సున్నిపెంటకు చేరుకున్నారు. సున్నిపెంటకు చేరుకున్న నారా లోకేష్ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో నారా లోకేష్ మొదటగా శ్రీ సాక్షి గణపతి స్వామిని దర్శించుకుని అనంతరం శ్రీశైలం కు చేరుకున్నారు. శ్రీశైలం చేరుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులకు ఆయన అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారిని దర్శనం కు స్వాగతించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా గడిపారు. స్వామి వారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని నారా లోకేష్ తెలిపారు.