Good News: త్వరలో రైతులకు శుభవార్త చెప్పబోతున్నాం..సీఎం రేవంత్ రెడ్డి

ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలెండ‌ర్, తెల్ల‌రేష‌న్ కార్డు ఉన్న ప్ర‌తి పేద‌వానికి 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించ‌నున్న‌ట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్య‌క్ర మాలు ప్రారంభానికి ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌రవుతార‌ని ఆయన వెల్ల‌డించారు. ఇక రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ పై బ్యాంకులతో చర్చిస్తున్నామని,త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

TAGS