కరోనా సమయంలో బాధితుల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచిన నటుడు సోనూ సూద్ ఓ అభిమాని ప్రేమకు ఫిదా అయ్యాడు. రెస్టారెంట్ లో అతడి డిన్నర్ బిల్లును అభిమాని చెల్లించారు. ఈ విషయాన్ని సోను స్వయంగా వెల్లడించారు. ఇలా ఎవరు చేశారో నాకు తెలియదు అన్నారు.
రెస్టారెంట్లో మా డిన్నర్ బిల్లు అంతా చెల్లించి ఈ స్వీట్ నోట్ ను వదిలేసి వెళ్లారు. ఇది నా హృదయాన్ని తాకింది. ధన్యవాదాలు మిత్రమా అని అతడు ట్విట్ చేశారు. మనం ఇతరులకు సహాయం చేస్తే అది తిరిగి మనకు ఇంకొక రూపంలో సహాయం అం దు తుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.
కరోనా కష్టకాలంలో తన సొంత డబ్బుతో కరోనా రోగులకు సహాయం చేశారు. ఒకరు కాదు కొన్ని వేల మందికి సోను ఆ సమ యం లో ప్రత్యక్ష దైవంగా మారాడు. ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయం అందించి జనం గుండెల్లో చిరస్థాయిగా పేరు సంపా దించుకున్నాడు.