Telangana:కుర్చీలాట..స్మితా సబర్వాల్ ఔట్..ఆమ్రపాలి ఇన్

Telangana:ప్రస్తుతం తెలంగాణలో స్మితా సబర్వాల్, ఆమ్రపాలి.. మహిళా ఐఏఎస్‌ అధికారుల పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకరు సీఎం ఆఫీసుకు గుడ్‌ బై చెప్పాలనుకుంటే మరొకరు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మొన్నటివరకు కేసీఆర్‌ టీమ్‌లో కీలకంగా వ్యవహరించిన స్మితా సబర్వాల్‌ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు ప్రిపేర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర సర్వీసులో ఉన్న మరో ఐఏఎస్‌ ఆమ్రపాలి రేవంత్‌రెడ్డి టీమ్‌ లో జాయిన్‌ అవుతారని సమాచారం. స్మితా సబర్వాల్‌ ను మెచ్చుకుని అప్పటి సీఎం కేసీఆర్‌ ఏరికోరి ఆమెను సీఎంవో కార్యదర్శిగా నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.

అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారులకు స్థానచలనం మొదలైంది. ఈ క్రమంలోనే ఐఏఎస్‌ అధికారులు స్మితా సబర్వాల్‌ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సర్కార్‌ కొలువుదీరినప్పటి నుంచి స్మితా సబర్వాల్‌ ఎక్కడా కనిపించడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమైన అధికారులు అంతా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. కానీ, స్మితా సబర్వాల్‌ మాత్రం ఇంతవరకు సీఎం రేవంత్‌ ను కలవలేదు. తన భర్త ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

అయితే స్మితా సబర్వాల్‌ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలి ఎంట్రీ ఇస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర సర్వీస్‌ ముగించుకుని తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్‌ ను కలవడం ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

TAGS