Bhupalapally:తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి. మంగళవారం ఎన్నకలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లోనూ తాము బలపరిచిన యూనియన్ విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. ఇందు కోసం ఇప్పటికే పావులు కదిపి తమ అనుకూల యూనియన్‌ని రంగంలోకి దించేసింది. ఇదిలా ఉంటే ఉదయం నుంచే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కార్మికులు భారీ సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ఇదిలా ఉంటే భూపాలపల్లి సింగరేణి కేటీకె-5 ఇంక్లైన్ గని దగ్గర ఉద్రక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. భూపాలపల్లిలోని 9వ పోలింగ్ కేంద్రంలో 30 శాతం పోలింగ్ నమొదైనట్టుగా తెలుస్తోంది.
బెల్లంపల్లి ఏరియాలో 38.1 శాతం పోలీంగ్ నమోదు కాగా..మంచిర్యాలలో తొలి రెండు గంటల్లో శ్రీరాంపూర్ ఏరియా 27.29 శాతం ఓటింగ్ నమోదైంది. మందర్రిలో 25.23 శాతం, బెల్లంపల్లిలో 38.1 శాతం పోలింగ్ నోమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. రామగుండం రీజియన్‌లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 30 శాతం పోలింగ్ నమోదైంది.