Pushkarini : శ్రీవారి భక్తులు అలర్ట్: నెల రోజులు పుష్కరిణి మూసివేత

Pushkarini

Pushkarini

Pushkarini : తిరుమలకు శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనానికి ముందు శ్రీవారి పుష్కరిణిలో (కోనేరు) స్నానం చేయడం ఆనవాయితీ. తలనీలాలు సమర్పించిన భక్తులతో పాటుగా ఇతర భక్తులు కూడా కోనేటిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు. అయితే, ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి నెల రోజుల పాటు మీకు ఆ భాగ్యం దక్కకపోవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని ఆగస్టు 1 నుంచి 31 వ తేదీ వరకు మూసువేయనున్నారు. ఈ నెల రోజుల పాటు శ్రీవారి భక్తులను కోనేట్లో స్నానం చేసేందుకు వీలుండదు.

శ్రీవారి పుష్కరిణిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించి, పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేసేందుకు నెల రోజుల పాటు పుష్కరిణిని మూసివేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో నెల రోజులు పుష్కరిణి  హారతి కార్యక్రమం ఉండదని తెలిపింది. పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.

TAGS