HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కు సంబందించిన ఆస్తులు లెక్కకు మించి బయటపడుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే శివబాలకృష్ణ ను ఏసీబి అధికారులు అరెస్ట్ చేశారు. 120 ఎకరా లకుపైగా స్థలాన్నిఏసీబీ గుర్తించారు. ఔటర్ రింగ్రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం..చౌటుప్పల్ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములను గుర్తించారు.కుటుం బసభ్యులతోపాటు స్నేహితులపై పేర్లపై భారీగా బినామీ ఆస్తులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు, బాల కృష్ణ స్నేహితుల్ని విచారించిన ఏసీబీ బాల కృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. వివిధ సంస్థలకు లబ్ధి చేకూర్చి వారి దగ్గర నుంచి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వాటాలు తీసుకునున్నట్లు తేలిందని ఏసీబి అధికారులు వెల్లడించారు.