కడప : ఏపి పి.సి.సి అధ్యక్షురాలు వైఎస్. షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు భద్రతా కల్పించడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తెలిపితే అటువంటి వారికి వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫారసు(సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఏపి వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈనేపద్యంలో రాజకీయంగా ఆమె అధికార పార్టీ పై పలువి మర్శలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో పలువురు రాజకీయనాకుల నుంచి బెదిరింపులువస్తున్న నేపధ్యంలో వైఎస్ షర్మిల తనకు బద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధి కారులను కోరింది. ఆమె కోరిక మేరకు సెక్యూరిటిని పెంచారు.