Revanth Reddy:కామారెడ్డి-కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ముందంజ
Revanth Reddy:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023 ఉత్కంఠ రేపుతున్నాయి. కేసీఆర్ వరుసగా మూడోసారి సీఎం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నందున తెలంగాణ రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఒక కారణమా కాదా అనేది నిర్ణయించే వార్ ఇదన్న చర్చ సాగుతోంది. అయితే కేసీఆర్ మూడో దఫా ఆకాంక్షను కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి భగ్నం చేస్తారా? అంటూ చర్చ వేడెక్కిస్తోంది. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు చెందిన రేవంత్‌రెడ్డి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) మధ్య పోరు రాష్ట్రానికి తదుపరి సీఎంను నిర్ణయించే అంశంగా ప్రచారం జరుగుతోంది. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గ్రాండ్ ఓల్డ్ పార్టీ నాయకుడిగా చర్చల్లో వ్యక్తి అయ్యారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే పైచేయి అని సూచించాయి. ఇద్దరు నేతలు కూడా తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ తన సిట్టింగ్ సీటు అయిన గజ్వేల్ (సిద్దిపేట జిల్లా).. రేవంత్ ఆయన సొంత గడ్డ కొడంగల్ (వికారాబాద్ జిల్లా) నుంచి పోటీ చేసారు.
2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన గంప గోవర్ధన్‌పై కేవలం 4,557 ఓట్ల తేడాతో ఓడిపోయిన కామారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహ్మద్ అలీ షబ్బీర్‌ను కేసీఆర్ తర్వాత రేవంత్ కోసం పక్కనే ఉన్న నిజామాబాద్ అర్బన్ స్థానానికి మార్చారు. కొడంగల్ తో పాటు ఈసారి కామారెడ్డిలోను రేవంత్ బరిలోకి దిగాడు. ఎగ్జిట్ పోల్ ప్రకారం కె చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్)కి రికార్డు స్థాయిలో మూడవసారి ఎన్నిక కాకుండా కాంగ్రెస్ తెలంగాణలో అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశం ఉందని తాజా కౌంటింగ్ సరళి వెల్లడిస్తోంది.
రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నుంచి కూడా పోటీకి దిగారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో రేవంత్ రెడ్డి ఈ రెండు స్థానాలలోనూ ఆధిక్యత కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు కొడంగల్ , కామారెడ్డి ల్లో మూడో రౌండ్ లోను రేవంత్ లీడ్ లో ఉన్నారు. కొడంగల్ 4159, కామారెడ్డి లో 2354 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని సమాచారం అందింది. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి వెనుకంజలోకి కామారెడ్డి విషయంలో నెట్టారన్న ప్రచారం ఉంది. ఈ ఆధిక్యం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తొలి రెండు మూడు రౌండ్లు మాత్రమే కాదు చివరికంటా బీఆర్ఎస్ పోరాడుతుందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పోలింగ్ జరిగిన 119 అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ 63 -73 సీట్లు గెలుస్తుందని, అధికార బీఆర్‌ఎస్‌కు 34- 44 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కాంగ్రెస్‌కు 42 శాతం ఓట్లు వస్తాయని, బీఆర్‌ఎస్‌కు 36 శాతం ఓట్లు రావచ్చని అంచనా.
ముక్కోణపు పోటీ:
కామారెడ్డిలో భాజపా తరపున కె వెంకట రమణారెడ్డి పోటీ చేయడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. దీంతో మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారంలో వైవిధ్యం కోసం ప్రయత్నించారు. ఈ ప్రాంతంలో రెడ్డి కులం ఓట్లు నియోజకవర్గంలో 7.5 శాతం ఉన్నాయి. కాగా తాను కామారెడ్డి బీబీపేట్ మండలం కోనాపూర్ గ్రామంలో పుట్టానని కేసీఆర్ చెప్పుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈసారి ఓటింగ్ శాతం తగ్గింది. గత ఎన్నికల్లో సగటు ఓటింగ్ శాతం 83.57 శాతం కాగా, ఈసారి 71.07 శాతంగా నమోదైంది.
కామారెడ్డి నియోజకవర్గంలో 68.94 శాతం పోలింగ్ నమోదైంది. 119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభకు గురువారం జరిగిన ఎన్నికల్లో 71.34 శాతం ఓటింగ్ నమోదైంది.