Revanth Reddy:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియలో అనూహ్య ఫలితాలు చోటు చేసుకుంటన్నాయి. ఈ ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడవ సారి విజయాన్ని సాధించి హ్యాట్రిక్‌ని దక్కించుకోవాలని బిరిలోకి దిగిన బీఆర్ ఎస్‌కు తాజాగా వస్తున్న ఫలితాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం అని తేల్చడం, అందుకు తగ్గట్టుగానే ఫలితాలు, కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో నిలుస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి.
ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండటం, మ్యాజిక్ ఫిగర్‌ని క్రాస్ చేయడంతో అధికారం హస్తగతం కావడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్‌గా బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి పోటీ చేసిన రెండు నియోజక వర్గాలైన కామారెడ్డి, కొడంగల్‌లోనూ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కామారెడ్డిలో సీఎం కేజీఆర్ మూడవ స్థానానికి పడిపోవడం రాజకీయ విశ్లేషకులను షాక్‌కు గురి చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ పల్లెల్లో, సిటీల్లో కాంగ్రెస్ గాలి వీస్తున్న వేళ టీ పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తూ నెట్టింట వైరల్‌గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల లెక్కింపులో అనూహ్యంగా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న వేళ రేవంత్ రెడ్డి షేర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
`అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు.
శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది` అంటూ తెలంగాణ ఆధన కోసం అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఓ ఫొటోని షేర్ చేస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు.
శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023