Revanth CM : ఏ రాష్ర్టాల్లోనైనా కాంగ్రెస్, బీజేపీ తమ సీఎం అభ్యర్థులను ముందుగా ప్రకటించవు. ఎందుకంటే అసమ్మతి ఏ రూపంలో ముప్పు తెస్తుందో ఊహించే వారు ఆఖరి నిమిషంలో అందరి సలహాల మేరకు, అందరితో మాట్లాడిన తర్వాతే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తారు. ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాయి అధిష్టానాలు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఈసారి మంచి దూకుడు మీద ఉన్నది. అధికార బీఆర్ఎస్ ను భీకరంగా ఢీకొట్టినట్లే కనిపిస్తున్నది. అయితే అప్పుడే కాంగ్రెస్ విజయం సాధిస్తే సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ జోరుగా నడుస్తున్నది.
అయితే ఇక ఎల్లో మీడియా అప్పుడే తన ప్రణాళికను సిద్ధం చేసింది. రేవంత్ రెడ్డే ఇక సీఎం అనే రేంజ్ లో ఇక లీకులు బయటకు ఇస్తున్నది. ఇప్పటికే హైప్ క్రియేట్ చేసింది కూడా. కాంగ్రెస్ ప్రచార బాధ్యతల్ని ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ముందుండి నడిపిస్తున్నారని, మిగతా సీనియర్లంతా కేవలం వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారని కథనాలను వడ్డి వారుస్తున్నది. అయితే దీనివెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇక రేవంత్ రెడ్డి అంటే ఠక్కున గుర్తొచ్చేది చంద్రబాబు మనిషి అని. చంద్రబాబు కోసమే ఎల్లో మీడియా రేవంత్ రెడ్డిని తన భుజాలపై మోస్తున్నదని టాక్ వినిపిస్తున్నది.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం మీరేనంటూ రేవంత్ రెడ్డిని అడిగితే, ఆయన ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే ఆయనపై ఎల్లో మీడియా చూపుతున్న అభిమానాన్ని మనం గమనించవచ్చు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థి పై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మరొకరు తెరపైకి రాకుండా రేవంత్ రెడ్డితో కలిసి ఎల్లోమీడియా మైండ్ గేమ్ ఆడుతున్న ప్రత్యర్థి శిబిరాల మీడియా చెబుతున్నది.
అయితే ఎన్నిక ల తర్వాత సీన్ ఇలా ఉండే అవకాశమే లేదు. సీనియర్ల గ్రూపులు మాత్రం రేవంత్ కు పుల్లలు పెట్టడం ఖాయం. అయితే కాంగ్రెస్ ఇప్పుడు గెలిచినా, పార్టీలో అంతర్గతంగా జరిగే కుమ్ములాటలు తీరని నష్టం జరిగే అవకాశం ఉంది. ఎవరికి వారే సీఎం అంటూ ప్రకటనలిస్తూ పోతే ఇక ప్రత్యర్థి వల వేయడం కూడా ఖాయం.