Purandeshwari: బాధ్యత అంటే పోస్ట్ మాత్రమే కాదు సేవ కూడా..పురందేశ్వరి
విజయవాడ: బిజెపిలో ప్రవాస భారతీయులు, గొలగాని చారిటబుల్ ట్రస్ట్ (GCT) చైర్మన్ గొలగాని రవిక్రిష్ణ జాయిన్ అయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం లో కాషాయం కండువా కప్పి రవికృష్ణ ను బిజేపీ రాష్ట్రఅధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సాదరంగా ఆహ్వానించారు. రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేసారని పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారన్నారు.
విజయ వాడ పశ్చిమ నియోజకవర్గం లో రవికృష్ణ ద్వారా బిజెపి బల పడుతుందన్నారు. పార్టీ లో చేరిన వారు బిజెపి బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలన్నారు. రవిక్రిష్ణ సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. మోడీ ఎపికి ఇచ్చిన నిధు లు, చేసిన అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
బాధ్యత అంటే పోస్ట్ మాత్రమే కాదనిసేవ అని నా మీద నమ్మకం తో ఇచ్చిన పనిని బాధ్యత గా నిర్వహిస్తానని బిజెపి బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తానని రవిక్రిష్ణ తెలిపారు. మోడీ నాయ కత్వంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిం దన్నారు. బిజెపి, యన్డీఎ సపోర్టర్ గా చాలా సేవా కార్యక్రమాలు చేశానన్నారు. ఒక కార్యకర్తగా నేను ఈ పార్టీ లో పని చేస్తానని పదవులు కోసం కాదు… పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తా అనిఆయన తెలిపారు.