Red Sandalwood Cultivated : ఎర్రచందనం ఇక ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు
Red Sandalwood Cultivated : ఎర్ర చందనాన్ని టెరో కార్పస్ సాటలైనస్ అనే శాస్రీయ నామంతో పిలుస్తారు. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్ (కర్ర) అని అర్థం కార్పస్ అంటే పండు అని అంటారు. దీని కాయ గట్టిగా ఉంటుంది. కానీ మొలకెత్తదు. అది మొలకెత్తాలంటే సంవత్సర కాలం పడుతుందట. అలా ఎర్ర చందనం పుట్టుకకు అంత కథ ఉంటుంది. అందుకే ఎర్రచందనం కర్రకు ఎంతో విలువ ఉంటుంది. అత్యంత ఖరీదైన కర్రగా పేరుంది.
ఈ చెట్టు నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించాయి. శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవుల్లో ఈ అడవులు ఉన్నాయి. శేషాచలం కొండల్లో ఎర్ర చందనం చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి విలువ ఉంటుంది. చైనా, రష్యా లాంటి దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే స్మగ్లర్లు ఎర్ర చందనం వేట సాగుస్తున్నారు. వాటిని అమ్ముకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.
ఎర్రచందనంపై కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దాని సాగు, వాణిజ్య విషయాల్లో నిబంధనలు సడలించింది. ఇక మీదట రైతులు ఎర్రచందనం సాగు చేసి దాన్ని ఎగుమతి కూడా చేసుకోవచ్చని సూచిస్తోంది. దీంతో రైతులు సాగు చేసినా ఎలాంటి ఇబ్బందులు పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు కేంద్రం సాయం అందిస్తోంది.
మనదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎర్రచందనం దొరుకుతుంది. దీంతో దీన్ని ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తూ స్మగ్లర్లు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎర్రచందనం దొంగ రవాణాను ఎంత అరికట్టాలని చూసినా వారి ఆట కట్టించడం లేదు. ఏదో ఒక రూపకంగా రవాణా సాగుతూనే ఉంది. అందుకే కేంద్రం ఎర్ర చందనం సాగు విషయంలో ఉన్న నిబంధనలు తొలగించి రైతులకు అనుకూల మార్పులు చేస్తోంది.