Red Alert : రోళ్లు పగిలే ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Red Alert : తెలంగాణలో రోళ్లు పగిలేలా ఎండలు తలపిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, వరంగల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, వచ్చే ఐదు రోజుల పాటు విపరీతంగా వడగాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకూడదని సూచించారు.