గత కొంత కాలంగా పేటీఎం పనితీరు సజావుగా సాగడం లేదు. ఈ క్రమంలో పలు ఆడిట్ నివేదికలు బహిర్గతం అయ్యాయి. వాటిల్లో ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేక ఉల్లంఘనలు గుర్తించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. మానిటరీ పాలసీతో పాటు ఇతర నిబంధనలు,మార్గదర్శకాలు పాటించడం లేదని తెలియ జేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌పై కొరడా ఝుళిపించాల్సి వచ్చింది వివరించింది. ఈ చర్యలతో పేటీ ఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, పేటీఎం బ్యాంకు లిమిటెడ్ నోడల్ అకౌంట్లను సైతం రద్దవుతాయి. 2022 లో సైతం ఆర్బీఐ ఒకసారి పేటీఎంపై చర్యలు తీసుకుని కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశాలుజారీ చేసిన సంగతి తెలిసిందే.
విత్‌డ్రాకు ఇబ్బంది లేదు..
ఈ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే పేటీఎం వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది.అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు తన నగదును వినియోగించుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంక్ లోని కెరెంట్ సేవింగ్స్,ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్ ,నేషనల్ మెబిలిటి కార్డు,ఫాస్టాగ్ సహా ఇతర ఏ ప్లాట్ ఫారం నుంచైనా నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదని వివరించింది. అలాగే పేటీఎం ఇచ్చే రిఫండ్లు,క్యాష్ బ్యాక్స్, వడ్డీలపైనా ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అయితే పేటీఎం యయూపీఐ పేమెంట్లపై ఎలాంటి ప్రభావ చూపదని సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది.