ఏపీ: కార్మిక వర్గాలకు సీఎం జగన్ నిత్యం అండగా ఉంటారని మంత్రి విడుదల రజిని అన్నారు. గుంటూరులో ఆటో డ్రైవర్లతో ఆమె ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు ప్రభుత్వం ఆర్థిక దన్ను ఇస్తోందని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి విడుదల రజిని కాసేపు ఆటో నడిపి సందడి చేశారు. రాష్ట్రంలో ఉన్న కార్మికుల కోసం వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని మంత్రి రజిని తెలిపారు.
ఆటో కార్మికులు ఇబ్బందులు పడకూడదని సంవత్సరానికి కొంత డబ్బులు వారి అకౌంట్లోకి జమ చేస్తున్నారని గతంలో ఏ ప్ర భుత్వం కూడా ఇలా ఆటో డ్రైవర్లు , కార్మికుల కోసం ఆలోచించలేదని మంత్రి అన్నారు.