Rajaiah: బీఆర్ఎస్ షాక్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య… ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరిక?

స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 10వ తారీ కున రాజయ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని తెలుస్తోం ది. గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీపై రాజయ్య అసంతృప్తిలో ఉన్నారు. తొలి ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన రాజయ్యకు ప్రస్తుతం పార్టీలో తగిన గుర్తింపు లేదని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది.

వరం గల్ ఎంపీ సీటు ను మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీట్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న రాజయ్య పార్టీ మారడానికి నిర్ణయం తీసుకున్నారు.

TAGS