నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అధిక పీడనం కారణంగా తేమగాలులు వీస్తుండడంతో నేటి నుంచి మూడు రోజులపాటు కోస్తాను, ఈనెల 24 నుంచి రాయలసీమలో చెదురు ముదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆటు తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం కనబడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.