Rains in Telangana : తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వానలు

Rains in Telangana
Rains in Telangana : తెలంగాణ ప్రజలకు, రైతులకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత రెండు మూడ్రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఇది నిజంగా ఉపశమనం కలిగించే వార్త. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఈరోజు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.