
Rain Alerts
Rain Alerts : విజయవాడలో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ఏరియాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.
అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం పడింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి చెరువు అలుగు దూకుతోంది. విడపనకల్లు మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో 19 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెంచులపాడు-పొలికి, పాల్తూరు-గోవిందవాడ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.