Ram Mohan, Pemmasani: రామ్మోహన్ కు రైల్వే, పెమ్మసానికి వైద్య ఆరోగ్యం (సహాయ)..!
Ram Mohan, Pemmasani: ప్రధాని మోడీ నాయకత్వంలో మంత్రులు ఈ రోజు (జూన్ 9)న ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ కేబినేట్ లో అత్యంత పిన్న వయస్కుడు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ) 36 సంవత్సరాల వయస్సులో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్‌లో చోటు దక్కించుకున్నారు. 2014 నుంచి ఇది అతను వరుసగా మూడో సారి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీ తిలక్‌పై 3.2 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రామ్మోహన్ నాయుడు.
రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. తర్వాత లాంగ్ ఐలాండ్ నుంచి ఎంబీఏలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని చేశారు. మొదట్లో సింగపూర్‌లో ఉద్యోగం చేశాడు. 2012లో కారు ప్రమాదంలో అతని తండ్రి మరణం తర్వాత అతను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మంచి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. వీటి కారణంగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడి పేరును సిఫారసు చేశారు. అయితే ఈయనకు రైల్వే శాఖ అప్పగించారు.
ఇక, టీడీపీ నుంచి మరో నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన తండ్రి సాంబశివరావు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట వాసులకు చిరపరిచితుడు. చంద్రశేఖర్ ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. మెడికల్ పూర్తి చేసుకొని అమెరికా వెళ్లి అక్కడ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ-సినాయ్ మాస్పిటల్ లో ఐదేళ్లు వైద్యుడిగా పని చేశారు. 2024లోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కిలారి వెంకట రోశయ్యపై 3.4 లక్షల ఓట్లతో విజయం సాధించారు. బెసిక్ గా వైద్యుడైన ఈయనకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కేటాయించారు.
ఇద్దరు నాయకులకు గుర్తింపు ఉన్న శాఖలు అప్పగించారంటూ ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి మరిన్ని రైల్వే లైన్లు వస్తాయని ఆశిస్తున్నారు. అలాగే సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని కూడా ఏపీలో వైద్య విధానాన్ని మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.