Priyanka Gandhi: ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు..
తెలంగాణలో ప్రియాంక గాంధీ రేపటి పర్యటన రద్దయింది. ఫిబ్రవరి 27న చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో రూ. 500 కే సిలిండర్, 200 యూ నిట్ల ఉచిత విద్యుత్ స్కీంలను ప్రారంభించారని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు కావడంతో రెండు గ్యారెంటీ అమలు పై ఎలా ముందుకెళ్లాలని దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు. అనుకున్న విధంగా అధికారంలోకి రావడంతో ఇ ప్పటికే రెండు గ్యారెంటీలను ప్రారంభించారు. అతి ముఖ్యమైన మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన కీలక నేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు కావడంతో ఎప్పటినుంచి ఆ రెండు హామీలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.