Pallavi Prashanth:బిగ్‌బాస్ సీజన్ 7 ఆదివారం పూర్తయింది. విన్నర్‌గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రైజ్ మనీ కింద రూ.35 లక్షలతో పాటు వితారా బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యూయలరీ గెలుచుకున్నాడు. సామాన్యుడి కేటగిరిలో హౌస్‌లోకి అడుగు పెట్టిన ప్రశాంత్ గెలుపే లక్ష్యంగా ఆడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని ఫైనల్లో విజేతగా నిలిచాడు. దీంతో అతని అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా రన్నరప్‌గా నిలిచిన అమర్దీప్ అభిమానులకు, ప్రశాంత్ అభిమానులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెచ్చిపోయిన అభిమానులు, కొంతమంది దుండగులు ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. బిగ్‌బాస్ షో తర్వాత ర్యాలీలో పలువురు కంటెస్టెంట్ల కార్లపై దాడి ఘటనకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశాంత్‌పై సుమోటోగా కేసు బుక్ చేశారు.
147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. అలాగే పలువురు అభిమానులపైనా కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు చూపించిన అత్యుత్సాహం బిగ్‌బాస్ విజేత ప్రశాంత్‌కు ఇబ్బందుల్ని సృష్టిస్తోందని వాపోతున్నారు.