PM Modi : మహాశివుడి జఠాధారి అయిన గంగమ్మను తలవనిది భారతీయులకు రోజు గడవడం సాధ్యం కాదు. నోటిలో గుక్కెడు నీటిని పోసుకున్నా.. గంగమ్మ తల్లీ అంటూ కాడుపులోకి జార విడుస్తారు భారతీయులు. దక్షిణ హిమాలయాల్లో హిమనీ నదాలైన భాగీరథీ, అలకనంద, మందాకిని, గంగోత్రి తదితర హిమనీ నదాల నుంచి పుట్టిన గంగమ్మ భాగీరథిగా మారి వేలాది కిలో మీటర్లు ప్రయాణిస్తూ సముద్రుడిని చేరే వరకు కోట్లాది ఎకరాలను ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. గంగా నది జీవనది అంటే ఎంత వేసవి కాలమైనా నీరు పారుతుంది. 2525 కిలో మీటర్ల పొడవు ప్రయాణించి హుగ్లీ వద్ద సముద్రంలో కలుస్తుంది.
కేవలం బీడు భూమిని సాగుగా మార్చడమే కాకుండా ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలను తాగుకుంది గంగమ్మ. అందులో అత్యంత గొప్ప ప్రదేశం కాశీ. శివయ్య కొలువైన కాశీలో గంగమ్మ ఆనందంగా ఉరకలు వేస్తుంది. శివయ్యను చూస్తూ పరవళ్లు తొక్కుతూ నాట్యం చేస్తుంది. ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలలో గంగను చూడడం వేరు.. కాశీలో చూడడం వేరు. కాశీలో గంగలో మునిగితే పాపాలు పోతాయన్న నమ్మకం ప్రతీ హిందువుకు ఉంటుంది. కేవలం హిందువులే కాదు.. అన్య మతాల వారు కూడా ఇక్కడ గంగమ్మకు దర్శించుకుంటారు.
కాశీలో ప్రతీ రోజు ‘గంగా హారతి’ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్ధాలుగా వస్తోంది. సిరులు పండించే జీవనదిని అమ్మవారిగా.. సాక్షాత్తు పరమ శివుడి పత్నిగా కొలుస్తారు. అందుకే పార్వతిని గుడిలో కొలిస్తే గంగను ఘాట్ లో కొలుస్తారు. గంగా హారతి అత్యంత అద్భుతంగా ఉంటుంది. రెండు గంటల వరకు హారతి ఇస్తారు. హారితిచ్చేవారు ఒకే రకమైన బట్టలు వేసుకొని యువతులను కూడా అమ్మవారిగా కొలిచి హారతిస్తారు.
వారణాసి ఎంపీ అయిన, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు నియోజకవర్గం వెళ్లినా గంగా హారతిలో పాల్గొంటారు. అమ్మవారికి పూజలు చేసి హారతి ఆసాంతం ఆనందంగా తిలకిస్తారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయనతో యూపీ సీఎం, గవర్నర్ కూడా హాజరవుతారు. ప్రధానిగా ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సారి వారణిసి వచ్చిన మోడీ సీఎం, గవర్నర్ తో కలిసి గంగామాతకు పూజలు చేసి హారతిలో పాల్గొన్నారు.