Dr. Jai : ‘పెత్తందారి’ జగన్.. ప్రజాస్వామ్య బాబు.. ముందే నినదించిన ‘జై’

CBN-Dr. Jai and Jagan

CBN-Dr. Jai and Jagan

Dr. Jai : సరిగ్గా ఆరునెలల క్రితం.. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిణామాలు.. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన నాటి సీఎం జగన్ మీద ఏపీ అంతటానే కాదు.. అమెరికాలోనూ నిరసన గళాలు ప్రతిధ్వనించాయి. చంద్రబాబుకు మద్దతుగా అమెరికాలోని ఐక్యరాజ్యసమితి భవనం దగ్గర యూబ్లడ్ ఫౌండర్ డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు టీడీపీ, జనసేన, ప్రవాస భారతీయులతో కలిసి నినదించారు.

నాడే చంద్రబాబుకు మద్దతుగా జై గారు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ఇప్పుడు నిజమైంది.. ఏపీలో అసలైన పెత్తందారులు జగన్, వైసీపీ నేతలేనని.. చంద్రబాబు కాదంటూ ప్రసంగించారు. ఇన్నాళ్లు వైసీపీ చేస్తోన్న చంద్రబాబు పెత్తందారులు అన్న ప్రచారం శుద్ధ తప్పు అని అందరికీ అర్థమయ్యేలా వివరించారు.

కట్ చేస్తే ఇప్పుడు అదే నిజమైంది. పెత్తందారులు అని చంద్రబాబు అండ్ కోను అన్న జగన్ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన రాజభోగాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే పెత్తందారులు చంద్రబాబు, టీడీపీ నేతలు కాదని.. జగన్ అని తేటతెల్లమైంది..

విశాఖలో సీఎం జగన్ హయాంలో రాజధాని, నివాసం కోసం రుషికొండపై కట్టుకున్న సీఎం క్యాంప్ ఆఫీసు భవనం ఫొటోలు బయటకు వచ్చాయి. ఒక్క బాత్రూం చూస్తేనే సామాన్యుడి ఇంటిని తలపిస్తోంది. ఆ లగ్జరీ బంగారు తాపడాలు.. ఖరీదైన ఫర్నీచర్, టైల్స్, ఇంటీరియల్స్ చూస్తే అసలు పెత్తందారుడు జగన్ అని.. తన రాజభోగాలకు ప్రజా ధనాన్ని వాడుకున్నాడన్న నిజం బయటకొచ్చింది.

ఈ విషయాన్ని ఆరు నెలల ముందే డా.జై గారు యూఎన్వో ఆఫీసు దగ్గర ప్రస్తావించడం విశేషం. అవే మాటలు ఇప్పుడు నిజమని రుషికొండ జగన్ లగ్జరీ నివాస సముదాయంతో తేటతెల్లమైంది. యూఎన్వో దగ్గర జై గారు అసలైన ‘పెత్తందారుడు’ జగన్ అన్న మాట ఇప్పుడు రుషికొండ నిర్మాణాలతో అందరికీ అర్థమైంది. ముందే ఊహించిన డా.జై గారి మాటలు వైరల్ అవుతున్నాయి.

TAGS