Chief Ministers : ముఖ్యమంత్రుల సమావేశానికి పవన్ కల్యాణ్

Chief Ministers
Chief Ministers : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా భవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటున్నారు. సమావేశంలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు సత్య ప్రసాద్, జనార్దన్ రెడ్డి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఫైనాన్స్ సెక్రటరీ జానకి, అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రా పాల్గొంటున్నారు.
అలాగే తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరక్, ప్రభుత్వ అడ్వైజర్స్ వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాలె, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ (ఫైనాన్స్) రామకృష్ణారావు, సెక్రటరీ టు సీఎం శేషాద్రి, అడ్వైజర్లు శ్రీనివాస రాజు, రఘునందన్ రావు పాల్గొంటున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ఇద్దరు సీఎంల భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రగతి భవన్ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.