పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్ రైల్వే స్టేషన్లో దుర్గారావును పోలీసులు అదపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదంలో కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నాడు. భోదన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడ్ని కేసు నుంచి తప్పించినందుకు దుర్గారావు ను సీపీ సస్పెండ్ చేశారు. దుర్గారావు పై పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా పరారైన దుర్గారావు ను గుంతకల్ రైల్వే పోలీసుల సహాయంతో దుర్గారావును అరెస్ట్ చేశారు.