Bus accident : పల్లె వెలుగు బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు

Bus accident
Bus accident : ఏపీలోని బస్సు ప్రమాదం జరిగింది. పల్లె వెలుగు బస్సు బోల్తాపడి పలువురికి గాయాలైనట్లు సమాచారం. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గుమ్మలకుంట సమీపంలో పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. నల్లమాడ నుంచి అనంతపురం వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్ట జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.