తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ఓ కాంగ్రెస్ నేత బస్సులో అక్కడకు చేరుకోగా.. ఓ బి ఆర్ ఎస్ నేత ఆటోలో అసెంబ్లీకి చేరు కున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన నాంపల్లి నుంచి బస్సులోనే ప్రయా ణిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
Congress MLC Balmuri Venkat came to the assembly in RTC bus
మొదటి రోజు అసెంబ్లీ కి ఆర్టీసీ బస్ లో వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
👉 నాంపల్లి లో బస్ ఎక్కి అసెంబ్లీ కి వచ్చిన వెంకట్.
👉 ఉచిత బస్ ప్రయాణం పై మహిళలతో మాట్లాడిన వారి అభిప్రయాలు తెలుసుకున్న వెంకట్.@VenkatBalmoor pic.twitter.com/UxqNMZ4hsi— Congress for Telangana (@Congress4TS) February 8, 2024
అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ర ని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్లు ఉపాధి దెబ్బ తింటుందన్నారు. అందుకే అసెంబ్లీకి ఆటోలో వచ్చి నిరసన తెలిపానని ఆయన తెలి పా రు. కాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిం చారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవి తొలి బడ్జెట్ సమావేశాలు కావడం విశేషం.
ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ ఆటోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/g7nRpi5JbR
— Telugu Scribe (@TeluguScribe) February 8, 2024